Kota Srinivasa Rao Death : కోట శ్రీనివాసరావు మరణంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 40ఏళ్లకు పైగా నటించిన కోట శ్రీనివాస రావు.. ఇండస్ట్రీలో అందరితో అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మరణ వార్త విని చాలా మంది నివాళి అర్పించేందుకు వస్తున్నారు. ముందుగా వచ్చిన బ్రహ్మానందం.. ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కోట శ్రీనివాస రావు గొప్ప నటుడు. ఆ విషయం నేను చెప్పక్కర్లేదు. కోట, నేను, బాబు మోహన్ కలిసి ఎక్కువగా నటించాం. రోజుకు 18 గంటలు కూడా పనిచేసేవాళ్లం. నలభై ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తనను తాను సముదాయించుకుని.. అరేయ్ ఒరేయ్ అని పిలుచుకునే వాళ్లం.
Read Also : Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్..
ఇవాళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నా. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడొక నట రాజపుత్రుడు. మహానుభావుడు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం మన దేశానికి, నటనా లోకానికే తీరని లోటు అంటూ ఎమోషనల్ అయ్యారు బ్రహ్మానందం. కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు మధ్యాహ్నం 3.30 గంటలకు మహా ప్రస్థానంలో జరగబోతున్నాయి. ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Read Also : Kota Srinivasa Rao : బ్యాంక్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చిన కోట..