డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు ఓటిటి వెర్షన్ ఇప్పుడు విజయవంతంగా ఎనిమిదో వారంలోకి అడుగు పెట్టింది. ఎదవ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుండి హాస్యనటుడు మహేష్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. బిందు మాధవి, అఖిల్, శివ ముగ్గురూ టాప్ 5 అంటూ బయటకొచ్చిన మహేష్ విట్టా చెప్పుకొచ్చారు. ఇకపై బిగ్ బాస్ నాన్-స్టాప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీకి పాన్ చేశారు. గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా బాబా భాస్కర్ మాస్టర్ ని కొత్త కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. ఈ మేరకు అధికారికంగా ఓ వీడియోను కూడా రివీల్ చేశారు. బాబా భాస్కర్ మాస్టర్ బిగ్ బాస్ తెలుగు – సీజన్ 3లో పాల్గొన్న విషయం తెలిసిందే.
Read Also : Samantha : టాటూలపై సామ్ షాకింగ్ కామెంట్స్
కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన బాబా భాస్కర్ మాస్టర్ ను మరోసారి బిగ్ బాస్ హౌజ్ లోకి, అందులోనూ సీక్రెట్ రూమ్ లోకి పంపారు. బాబా భాస్కర్ కు హోస్ట్ నాగార్జున స్వయంగా వెల్కమ్ చెప్పారు. నేను అనుకున్నంత స్ట్రెయిట్ గా ఏం లేరు… ముదురుగానే ఉన్నారు అంటూ వచ్చి రాగానే బాబాపై పంచ్ వేశారు నాగార్జున. ఈరోజు హౌజ్ మేట్స్ ను బాబా భాస్కర్ సర్ప్రైజ్ చేసే అవకాశం ఉంది. మరి హౌజ్ మేట్స్ ఆయన వైల్డ్ కార్డు ఎంట్రీని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
https://www.youtube.com/watch?time_continue=46&v=5X3fr47LJEQ&feature=emb_logo