Baahubali : రాజమౌళి సృష్టించిన కలాఖండం బాహుబలి మరోసారి మన ముందుకు రాబోతోంది. అక్టోబర్ 31న దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే రెండు పార్టులను కలిపి ఒకే దాంట్లో చూపిస్తామని ఇప్పటికే రాజమౌలి ప్రకటించారు. రెండు పార్టులు అంటే రన్ టైమ్ భారీగా ఉంటుందనే ప్రచారం మొదలైంది. కొందరేమో 5 గంటలు ఉంటుందని.. ఇంకొందరేమో 4 గంటలకు పైగా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరీ అన్ని గంటలు అంటే థియేటర్లలో ప్రేక్షకులు చూస్తారా అంటూ నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ టైమ్ లో హీరో రానా స్పందించారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘కొత్తపల్లిలో ఒకరోజు’ మూవీ జులై 18న రిలీజ్ కాబోతోంది. రానా వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు.
Read Also : Thammudu : నితిన్ ‘తమ్ముడు’ ఓటీటీ డేట్ లాక్..?
ఓ ఇంటర్వ్యూలో బాహుబలి రన్ టైమ్ గురించి ప్రశ్న ఎదురవగా స్పందించాడు. ‘రన్ టైమ్ ఎంత ఉన్నా నాకు హ్యాపీనే. ఎందుకంటే నేను ఈ ఏడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా నాకు బ్లాక్ బస్టర్ రాబోతోంది. కొందరేమో 5 గంటలు అంటూ పోస్టులు పెడుతున్నారు. అన్ని గంటలు ప్రేక్షకులు సీట్లలో కూర్చుంటారా లేదా అన్నది సందేహమే. కానీ రాజమౌళి ఏం చేసినా ఆలోచించే చేస్తారనే నమ్మకం నాకుంది. రన్ టైమ్ గురించి నాకు ఎలాంటి క్లారిటీ లేదు. దాని గురించి రాజమౌళికే తెలియాలి. ఆయన నాకేం చెప్పలేదు. రన్ టైమ్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే రాజమౌళి డిజైన్ చేస్తారు అంటూ తెలిపాడు రానా. అక్టోబర్ 31న ది బాహుబలి-ఎపిక్ పేరుతో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి రెండు పార్టుల్లోని కొన్ని ఇంపార్టెంట్ సీన్లతో ఒకే సినిమాగా తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Read Also : Suriya : సూర్య ‘కరుప్పు’ టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్