వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈసారి కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ‘తమ్ముడు’ సినిమాకు ఓకే చెప్పారు. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వర్ష బొల్లమ్మ – సప్తమి గౌడ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం, జూలై 4న థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్‌తో కలెక్షన్ల పరంగా బలహీనపడింది. ఈ మూవీతో హిట్ కొట్టాలని అనుకున్న నితిన్ కలలు కల్లలయ్యాయి. బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ చిత్రం పాజిటివ్ రిజల్ట్ చూపించలేకపోయింది.
Also Read : Prabhas: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది!
కీలకమైన వీకెండ్‌లోనూ కనీస కలేక్షన్ కూడా రాలేదు. దీంతో, చిత్రబృందం త్వరగానే ఓటీటీ రిలీజ్‌కు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందట. ఈ ఆగస్టు 1 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేస్తుందిని లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది అనధికారిక మే కానీ దాదాపు ఇదే డేట్ లో రావచ్చట.