Ayyagaru Pelliki Ready Movie Glimpse Released: అఖిల్ అక్కినేని ఫ్యాన్ ఒకరు అయ్యగారే నెంబర్ 1 పేరుతో సోషల్ మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ విధంగా అయ్యగారు అనగానే అందరికీ గుర్తుండి పోయే పేరు అయిపోయింది అఖిల్ పేరు. ఇక ఈ క్రమంలో అయ్యగారు (పెళ్ళికి రెడీ) అనే పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎ. వెంకట రమణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ గ్లింప్స్ ని ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేసి సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సందర్భంగా దర్శకుడు అర్మాన్ మెరుగు మాట్లాడుతూ ఈ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్నానని, నేటి యువతకు అద్దం పట్టేలా ఒక సెన్సిటివ్ పాయింట్ ని ఎoటర్టైన్మెంట్ తో మిలితం చేసి తెరకెక్కిస్తున్న సినిమా ఇది అని అన్నారు.
అందరినీ నవ్విస్తూ మనిషి విలువలు చెప్పడమే మా సినిమా ముఖ్య ఉద్దేశం అని అన్నారు. దర్శకత్వం చేస్తూ హీరోగా నటిస్తూ సంగీత దర్శకత్వం కూడా తానే వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫర్ సి.యస్ చంద్ర, నటులు సునీల్ రావినూతల, రాజేష్, చిత్ర, జోసెప్ సంపంగి, శ్రీనివాస్ నాయక్ , గోపి చందు తదితరులు పాల్గొన్నారు. అర్మాన్ మెరుగు, సిద్ధి ఖన్నా, వెంకట రమణ, సునీల్ రావినూతల, ప్రకాష్, రాజేష్, మహేష్, గోపి చందు, మేఘన అనిమిరెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి లిరిక్స్ అర్మాన్ మెరుగు, బాలా లింగేశ్వర్, శ్రీనివాస్ తమ్మిశెట్టి, ప్రశాంతి పొలకి నటిస్తున్నారు.