Ayyagaru Pelliki Ready Movie Glimpse Released: అఖిల్ అక్కినేని ఫ్యాన్ ఒకరు అయ్యగారే నెంబర్ 1 పేరుతో సోషల్ మీడియాలో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ విధంగా అయ్యగారు అనగానే అందరికీ గుర్తుండి పోయే పేరు అయిపోయింది అఖిల్ పేరు. ఇక ఈ క్రమంలో అయ్యగారు (పెళ్ళికి రెడీ) అనే పేరుతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఎ. వెంకట రమణ నిర్మిస్తున్నారు.…