Natural Star Nani intresting Comments: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ ను వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా గ్రాండ్ లాంచ్ చేశారు. నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవగా అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పని కోరుతుంది. అయితే నన్ను ఎందుకో ప్రతిదీ వివరిస్తాడు కానీ ఆమె తల్లి గురించి ఏదో దాచిపెడతాడు. ఇక అలా సాగిన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో నన్ను నేను తెరపై చుసుకున్నపుడు ‘వీడెవడో బాగున్నాడు’ అని అనిపించింది ‘హాయ్ నాన్న’ సినిమాకే అని అన్నారు.
Vivek: భూస్వాములకు రైతుబంధు ఎందుకు..? కౌలు రైతులకు అండగా కాంగ్రెస్..
శౌర్యువ్ రాసుకున్న కథలో సాన్ జాన్ చూపించిన విజువల్స్ చాలా బాగుంటానని, టీజర్ పాటలు ఇప్పుడు ట్రైలర్ చూశారు కానీ మీరు ఇంకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత వుందని అన్నారు. మీరంతా సినిమాతో ప్రేమలో పడిపోవడం ఖాయం అని ఆయన అన్నారు. సినిమా అనేది నాకు ఆక్సిజన్ తో సమానమని పేర్కొన్న ఆయన సినిమా అనేది నిజంగా నా ఊపిరి, ఆ ఊపిరి మీద ఒట్టేసి చెబుతున్నా డిసెంబర్ 7కి మీరంతా ప్రేమలో పడిపోయే సినిమా వస్తుందన్నారు. ఆ భాద్యత నాది, మా టీం అందరిది అయితే బాక్సాఫీసు బాధ్యత మీది, ప్రామిస్, అందరికీ పేరుపేరునా లవ్ యూ సో మచ్’’ అన్నారు.