ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులరైన ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఫిల్మ్ ఓం భీమ్ బుష్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది. హారర్ కామెడీ కంటెంట్ వల్ల హీరోయిన్ పెద్దగా రిప్రజెంట్ కాలేదు కానీ సినిమా మాత్రం సూపర్ హిట్. అదే టైంలో కోలీవుడ్‌లో స్టార్ అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్. ఈ టూ ఫిల్మ్స్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమెకు కన్నప్ప రూపంలో బిగ్ ఆఫర్ తగిలింది. నుపుర్ సనన్ తప్పుకోవడంతో ఆఫర్ ప్రీతిని వరించింది.
Also Read : Tollywood : పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?
కన్నప్పతో హ్యాట్రిక్ హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ ట్యాగ్ తీసుకుందామనుకున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్ ప్లాప్ చవిచూసింది. సినిమాలో ప్రీతి నటించింది అన్నమాటే కానీ మేడమ్ ప్రమోషన్లలో పాల్గొనలేదు. కానీ సినిమాలో గ్లామర్ షో, ఇంటిమసీ సీన్లలో తన స్టఫ్ ఇచ్చేసింది. యూత్ నయా గర్ల్ ఫ్రెండ్‌గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ తెరంగేట్రం సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ కావడంతో పాటు రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో నెక్ట్స్ మల్లూవుడ్‌లో లక్ టెస్ట్‌కు రెడీ అవుతోంది భామ. మైనే ప్యార్ కియా అంటూ మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది ప్రీతి ముకుందన్. హృదు హరూన్ హీరోగా నటిస్తోన్న ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఆగస్టు 29న ఓనమ్ కి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇప్పుడిప్పుడే మలయాళంలో రిజిస్టర్ అవుతోన్న ఎలక్ట్రానిక్ కిలీ మ్యూజిక్ డైరెక్టర్. మైనే ప్యార్ కియానే కాదు ప్రీతి చేతిలో మరో మాలీవుడ్, రెండు తమిళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ కన్నప్ప తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. మరి కన్నప్ప వల్ల మేడమ్ హర్ట్ అయ్యిందో లేక ఆఫర్లు రావట్లేదో కొత్త సినిమా కబురు చెప్పలేదు. మళ్లీ ప్రీతి టాలీవుడ్ తలుపు తడితే చూడాలనుకుంటున్నారు ఇక్కడి ఆడియన్స్.