చిట్టిగా ఓవర్ నైట్‌లో యూత్ క్రష్‌గా మారింది పొడుగు కాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలుతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన విజయాలు అందించలేదు. అక్కినేని హీరోలతో ఛాన్స్ వచ్చిందీ కానీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజులో జస్ట్ క్యామియో రోల్స్‌తో సరిపెట్టేసుకుంది. లైక్ అండ్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ప్లాప్ టాక్ తెచ్చాయి. కల్కి2898ఏడీతో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చినా ఫరియాకు పెద్దగా యూజ్ కాలేదు. మత్తు వదలరా2తో బ్లాక్ బస్టర్ అందుకుంది.
Also Read : September : సెప్టెంబర్ 5న సిల్వర్ స్క్రీన్‌పై మీడియం రేంజ్ సినిమాల సంగ్రామం..
మత్తువదలరా2తో గట్టి కంబ్యాక్ కొట్టిన తర్వాత కూడా ఫరియాకు లక్ కలిసి రావట్లేదు. బిగ్ హీరోల ఆఫర్స్ కోసం చూస్తే ఫేట్ మరోటి డిసైడ్ చేస్తోంది చిట్టి విషయంలో. ఎస్టాబ్లీష్ కానీ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పోనీ కోలీవుడ్ చెక్కేద్దామంటే అక్కడ గడ్డుకాలం ఎదురౌతుంది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన వల్లిమయిల్ చేసింది బ్యూటీ. షూటింగ్‌కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టారు కానీ విడుదలకు నోచుకోవడం లేదు. కోలీవుడ్ ఎంట్రీ కూడా మరింత ఆలస్యం అయ్యేట్లే కనిపిస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేడమ్‌కే క్లారిటీ లేదు. తెలుగులో ఎప్పుడో కమిటైన భగవంతుడు ఎంత వరకు వచ్చిందో నయా అప్డేట్ లేదు. ఇక ఓటీటీ హీరోగా బ్రాండ్ వేయించుకున్న నరేష్ అగస్త్యతో గుర్రం పాపిరెడ్డిలో జోడీ కడుతోంది. అడల్ట్ కామెడీగా వస్తోన్న రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌తో టచ్ పోకుండా ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఫరియా.