Prabhas: ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని తారల జాతకాల గురించి చెప్తూ ఫేమస్ అయ్యాడు. అయితే ఆయన మాటలను ఎవరు పట్టించుకొంటారు అనే సమయంలో ఆయన చెప్పినట్లుగానే సమంత- చైతన్య విడిపోవడంతో ఒక్కసారిగా వేణు స్వామి మాటలను ప్రతి ఒక్కరు నమ్మడం మొదలుపెట్టారు. ఇక మొన్నటికి మొన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న నయన్ – విగ్నేష్ జంట కూడా ఎంతో కాలం కలిసి ఉండరని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చిన వేణు స్వామి తాజాగా ప్రభాస్ కు జాతకం గురించి చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఒక యూట్యూబ్ ఛానెల్ లో ప్రభాస్ జాతకం గురించి చెప్పుకొచ్చిన ఆయన డార్లింగ్ కు పెళ్లి యోగం లేదని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ప్రభాస్ కు శని మహర్దశ నడుస్తుందని చెప్పిన వేణు స్వామి ముందు ముందు ప్రభాస్ కెరీర్ మంచిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రభాస్ కు ఇంకా పెళ్లి ఆలస్యం అవుతుందని, అతని జాతకంలో పెళ్లి రాసిపెట్టిలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పెళ్లి అయినా ఆ తరువాత అతనికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, పెళ్లి చేసుకుంటే అతని ఫేమ్ పోతుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వేణు స్వామి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాక్యలపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? అని ఎదురుచూస్తున్న వారికి వేణుస్వామి మాటలు పిడుగు పడ్డట్లు అనిపించకమానదు. ఇలాంటివాటిపై నమ్మకం పెట్టవద్దని, ప్రభాస్ కు త్వరలోనే వివాహం అవుతుందని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ వీడియో వచ్చి చాలారోజులు అవుతున్నా మరోసారి ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు.