Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
ప్రముఖ సోషల్ మీడియా స్టార్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డిపై సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లండన్‌లో నివసిస్తున్న ధర్మేంద్ర అనే వ్యక్తి, ఆశు రెడ్డి తనను ప్రేమ పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిందని ఎన్టీవీ (NTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తనను నిండా ముంచిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఎనిమిదేళ్లుగా తన నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిందని లండన్ నివాసి ధర్మేంద్ర ఆరోపించారు. కేవలం అషు రెడ్డి మాత్రమే కాకుండా, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ మోసంలో భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. ధర్మేంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకుంటాననే సాకుతో అషు రెడ్డి ఇప్పటివరకు సుమారు 9.30 కోట్ల రూపాయలను తన నుంచి తీసుకుంది. తన డబ్బుతోనే ఆమె విలాసవంతమైన ఇల్లు, కారు మరియు బంగ్లాలను కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అషు రెడ్డి సోదరికి 75 లక్షల రూపాయల విలువైన డాలర్లు, అలాగే ఆమె తండ్రికి 92 లక్షల రూపాయలను బదిలీ చేసినట్లు ధర్మేంద్ర సాక్ష్యాధారాలతో సహా ఆరోపించారు.
నిశ్చితార్థం, పెళ్లి అని నమ్మించి రెండుసార్లు ముహూర్తాలు కూడా ఖరారు చేయించుకుందని, తీరా పెళ్లి సమయం దగ్గరపడేసరికి క్యాన్సిల్ అంటూ డ్రామాలు ఆడిందని ఆయన వాపోయారు. ఎనిమిదేళ్ల బంధాన్ని కేవలం డబ్బు కోసమే ఆమె వాడుకుందని ధర్మేంద్ర విమర్శించారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆశు రెడ్డి అసలు స్వరూపం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. తనపై వేధింపుల కేసులు పెట్టి ఇబ్బంది పెడతానని ఆశు రెడ్డి బెదిరించినట్లు ఆయన తెలిపారు. కొన్ని సందర్భాల్లో తన డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానని కూడా భయపెట్టిందని వెల్లడించారు. ఏడాది కాలంగా మధ్యవర్తుల ద్వారా సెటిల్మెంట్ చేసుకుందామని చెబుతూ, సమయం గడుపుతూ తనను వేధిస్తోందని ధర్మేంద్ర అన్నారు. “అషు రెడ్డి, ఆమె కుటుంబం నుంచి నాకు ప్రాణభయం ఉంది. అందుకే భరించలేక పోలీసులను ఆశ్రయించాను. న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను.” అని బాధితుడు ధర్మేంద్ర పేర్కొన్నారు.
Also Read
- The Paradise: 'ఆయా షేర్' తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. 'ది ప్యారడైజ్' సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
- Anil Ravipudi: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రేసు నుంచి అనిల్ రావిపూడి అవుట్?
- Mega 158 Update: 'మెగా 158' నుంచి ఊరమాస్ అప్డేట్! బాబీ మార్క్ 'స్వాగ్'తో బాస్ లుక్.. చూశారా?
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!