నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాతో కన్నడ బ్యూటీ ‘అషిక రంగనాథ్’ హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. కన్నడలో టాప్ హీరోస్ అయిన శివన్న, కిచ్చా సుదీప్ లాంటి స్టార్స్ పక్కన నటించిన అషిక, తెలుగులో నటించిన ‘అమిగోస్’ సినిమాతో తెలుగులో డీసెంట్ డెబ్యూనే ఇచ్చింది. ముఖ్యంగా ‘ఎన్నో రాత్రులు’ సాంగ్ లో అషిక చేసిన డాన్స్ అండ్ గ్లామర్ షోకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సాంగ్ కి ఎంత కావాలో అంతే గ్లామర్ గా కనిపించడంతో అషిక రంగనాథ్ కి తెలుగులో ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే అమిగోస్ సినిమా సూపర్ హిట్ అయ్యి ఉంటే అషిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండేది కానీ అలా జరగలేదు. అమిగోస్ సినిమాతో కాకపోయినా సోషల్ మీడియాతో తెలుగు యూత్ కి అషిక రంగనాథ్ బాగా కనెక్ట్ అయ్యే ఉంది.
ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. మితిమీరిన గ్లామర్ షో లేకుండా క్యూట్ గా ఉండే ఫోటోస్ ని అషిక రంగనాథ్ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా బ్లూ డెనిమ్ లో మోడరన్ లుక్ అషిక రంగనాథ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ ని పోస్ట్ చేసింది అషిక. యాక్టింగ్, గ్లామర్, డాన్స్ లాంటి విషయాల్లో అషిక ఇప్పటికే ఆకట్టుకున్న అషిక చేతిలో ప్రస్తుతం ఉన్న ఏకైక తెలుగు సినిమా ‘నా సామీ రంగ’. కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న ఈ మూవీ సంకాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మాస్ సినిమా హిట్ అయితే తెలుగులో అషిక రంగనాథ్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ వచ్చేసినట్లే.
Denim affair 🩵🩶 pic.twitter.com/tspXejMmLF
— Ashika Ranganath (@AshikaRanganath) November 25, 2023