As of now No Hike In Ticket Price For Chiranjeevi’s Bhola Shankar Movie : మెగాస్టార్ లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ మేనియా మొదలైపోయింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్నాడు భోళా శంకర్. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్ అదిరిపోవటంతో అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తోడు మేకర్స్ ప్రమోషన్స్ కూడా మరింత బజ్ పెంచుతున్నాయి. ఇక ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలుకానుంది. హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో ఈ ఈవెంట్ జరగనుంది. మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్ట్ U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 39 నిమిషాల 49 సెకన్లుగా లాక్ చేశారు. అంటే.. దాదాపు 160 నిమిషాలు భోళా భాయ్ రచ్చ చేయనున్నాడని చెప్పవచ్చు. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.
Tamannaah Bhatia: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్.. విజయ్ వర్మ పరిస్థితేంటో?
ఇప్పటికే హైదరాబాద్‍లోని కొన్ని థియేటర్లలో భోళా శంకర్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. మరో రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ బుకింగ్స్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా నార్మల్ టికెట్ రేటుతోనే థియేటర్లోకి రానుందని తెలుస్తోంది. టికెట్ రేట్లు పెంచకూడదని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. మామూలుగా అయితే బడా హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ మధ్య టికెట్ రేట్లు పెంచుతున్నారు. కానీ భోళా శంకర్ కోసం ప్రత్యేకంగా టికెట్ రేటు పెంచడం లేదని తెలుస్తోంది. దీంతో థియేటర్లలో స్టాండర్డ్ రేట్లు ఉండనున్నాయి. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‍గా నటించింది. కీర్తి సురేశ్.. చిరు చెల్లెలిలో పాత్రలో నటించగా.. సుశాంత్ కీ రోల్ ప్లే చేశాడు.