Aryan Khan dating rumors with Brazilian actress Larissa Bonesi: షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కాడు. రెడ్డిట్‌లో సోషల్ మీడియా యూజర్ చేసిన పోస్ట్ తర్వాత, ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ నటి లారిస్సా బోనేసితో డేటింగ్ చేస్తున్నారనే టాక్ మొదలాడింది. లారిస్సా బోనెసి.. బ్రెజిలియన్ మోడల్ అలాగే హీరోయిన్. తెలుగులో తిక్క సినిమాలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది. ఆ సినిమా టైంలోనే సాయిధరమ్, లారిస్సాకు మధ్య ఏదో ఉందనే రూమర్స్ కూడా గట్టిగానే వినిపించినా ఆ తరువాత కూడా వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు రచ్చ రేపాయి. ఇక ఆమె అక్షయ్ కుమార్ మరియు జాన్ అబ్రహంతో కలిసి బ్లాక్ బస్టర్ సాంగ్ “సుబా హోనే నా దే”తో తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇది కాకుండా, ఆమె టైగర్ ష్రాఫ్ అలాగే సూరజ్ పంచోలితో కొన్ని మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌లు కూడా చేసిoది.
Keerthi Suresh : బంఫర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేష్.. పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్..?
ఆమె మంచి డ్యాన్సర్ మాత్రమే కాదు, గొప్ప నటి కూడా. లారిస్సా బోనేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘నెక్స్ట్ అన్నీ’, ‘తిక్క’ సినిమాల్లో నటించింది. ఇక ఆమె బాలీవుడ్‌లో సైఫ్ అలీ ఖాన్ ‘గో గోవా గాన్’లో సహాయ నటి పాత్రతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. రెడ్డిట్‌లో ఆర్యన్ మరియు లారిస్సా ఫోటోలు- వీడియోలు కనిపించినప్పుడు ఈ చర్చ మొదలైంది. ఆర్యన్ దుస్తుల బ్రాండ్ ప్రచారంలో లారిస్సా కూడా కనిపించింది. రెడ్డిట్‌లో షేర్ చేసిన వీడియోలో ఆర్యన్ అలాగే లారిస్సా కలిసి నిలబడి ఉన్నారు. ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో లారిస్సా మరియు ఆమె మొత్తం కుటుంబాన్ని ఫాలో అవుతున్నాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. లారిస్సా తల్లి పుట్టినరోజున, ఆర్యన్ బ్రాండెడ్ దుస్తులను బహుమతిగా పంపాడు, దానిని లారిస్సా తల్లి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఆర్యన్ కంటే ముందు, ఆమె ఇక్కడ సౌత్ లో సాయి ధరమ్ తేజ్, సూరజ్ పంచోలితో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆర్యన్ విషయానికి వస్తే అనన్య పాండే, షానాయ కపూర్‌లతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు.