Arundhati: అమ్మాళీ.. ఎంత బొమ్మాళీ.. వచ్చి 15 ఏళ్లు అయినా ఆ భయం పోలేదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arundhati: ఇప్పుడంటే.. మైథలాజికల్ సినిమాలు అని, పౌరాణిక సినిమాలు, హర్రర్ సినిమాలు అని.. కొత్త టెక్నాలిజీతో విజువల్స్ చూపించి భయపెడుతున్నారు కానీ, అప్పట్లో అరుంధతి సినిమా చూసి.. దాదాపు ఎంతోమంది రెండు రోజులు నిద్రకూడా పోలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక సంక్రాంతికి ఇప్పుడు అంతా హనుమాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలాగే సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. సెన్సేషనల్ హిట్ అందుకున్న అరుంధతి నేటికి 15 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అరుంధతి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం.
లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడినట్లు ఎన్నోసార్లు తెలిపారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజూ జనవరి 16, 2009లో విడుదలై, తెలుగు సినిమా చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసింది. అసలు ఈ కథ ఎలా మొదలయ్యింది అంటే.. ఒక పార్టీలో నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి బంధువు పదే పదే గద్వాల్ కోట గురించి మాట్లాడుతండగా ఆయనకు ఆసక్తికరంగా అనిపించిందట. ఇక ఆ కోట గురించి తెలుసుకొని.. దానిపై ఒక సినిమా తీయాలని అనుకున్నారట. ఇక ఈ కోటకు.. చిన్నప్పుడు తన తాత చెప్పిన కథలోని ఒక లైన్ తీసుకొని యాడ్ చేయాలనుకున్నారు. కోటలో రాజకుమారి పనివాడితో ఉండగా చూసిన రాజు ఇద్దరినీ చంపేసి అదే గదిలో వారిని సమాధి చేశాడు.. ఇదే కథ గద్వాల్ కోటలో జరిగితే.. ఈ ఒక్క ఆలోచనే అరుంధతి తీయడానికి మూలం. ఆ తరవాత దర్శకుడు కోడి రామకృష్ణను పిలిచి కథను డెవలప్ చేశారు.
Also Read
- Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
- Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
- Sara Arjun: సారా అర్జున్‌కు బంపర్ ఆఫర్.. మ్యూజికల్ లవ్‌స్టోరీలో ఛాన్స్.. హీరో ఎవరంటే?
- OM Box Office Collections: కలెక్షన్స్ భారీగా డ్రాప్.. 'ఓం' బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రావాలంటే?
ఇక అదే సమయంలో హీరోయిన్ గా ఎవరు బావుంటారు అనుకుంటుండగా.. అనుష్క పేరు వినిపించింది. ఈ సినిమాకు ముందు స్వీటీ.. విక్రమార్కుడు,లక్ష్యం, డాన్ లాంటి మంచి విజయాలను అందుకుంది. అరుంధతిగా ఆమె బాగా సెట్ అవుతుంది అనుకున్నారట. అలా అరుంధతి మొదలయ్యింది. ఇక అనుష్క తరువాత అంతటి పవర్ ఫుల్ క్యారెక్టర్ అంటే సోనూసూద్ మాత్రమే. పశుపతిగా సోనుసూద్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. సోనూసూద్ కు సాయి కుమార్ అన్న రవి శంకర్ డబ్బింగ్ చెప్పారు. ఇక పాడనా ప్రళయ కీర్తనా సాంగ్ కోసం అనుష్క ఎంతో కష్టపడి డ్యాన్స్ నేర్చుకుంది. ఈ సినిమా తరువాత అనుష్క, సోనూసూద్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2009 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.70 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నందులను అరుంధతి సొంతం చేసుకుంది. సాంగ్స్, విజువల్స్, మ్యూజిక్.. మొత్తం ఈ సీనియాకు హైలైట్ గా నిలిచాయి. అమ్మాళీ.. ఎంత బొమ్మాళీ..డైలాగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంది. ఇప్పుడు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ ఈ లోకంలో లేకపోయినా.. ఆయన సినిమాలతో ఇంకా జీవించే ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చి 15 ఏళ్లు అయినా కూడా పశుపతి భయం పోలేదు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Tollywood: ఇంటర్వెల్ వరకు కాలర్ ఎగరేస్తే.. క్లైమాక్స్‌కు తల పట్టుకుంటున్నారు!
-
Tariff on US Goods: అమెరికా 25 శాతం వేస్తే.. భారత్ కూడా అదే చేయాలి! ప్రధాని మోదీకి వ్యాపారుల లేఖ
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
-
Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!