Aakrosam: డిసెంబర్ 16వ తేదీ ‘అవతార్ -2’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఆ సునామి ని తట్టుకోవడం కష్టమని భావించిన చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను ఓ వారం ముందే అంటే డిసెంబర్ 9వ తేదీనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ రకంగా ఇప్పటికే డిసెంబర్ 9వ తేదీని ఏకంగా పది సినిమాలు క్యూ కట్టాయి. ‘గుర్తుందా శీతాకాలం’, ‘పంచతంత్రం’, ‘లెహరాయి’, ‘డేంజరస్’, ‘రాజయోగం’, ‘ఎపి 04 రామాపురం’, ‘చెప్పాలని ఉంది’, ‘డాక్టర్ 56’ సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. వీటితో పాటే కన్నడ అనువాద చిత్రాలు ‘విజయానంద్’, ‘ ఐ లవ్ యూ ఇడియట్’ కూడా అదే తేదీ రాబోతున్నాయి. ఇవి చాలవన్నట్టుగా తాజాగా అరుణ్ విజయ్ నటించిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా నిర్మాతలు సి.హెచ్. సతీష్ కుమార్, ఆర్. విజయ్ కుమార్ మాట్లాడుతూ ”మంచి సినిమాలను, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అరుణ్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఇక్కడ కూడా మంచి ఆదరణను పొందాయి. ఇంత ముందు అరుణ్ విజయ్ హీరోగా నటించిన ‘ఏనుగు’ సినిమాను మా బ్యానర్లోనే విడుదల చేశాం. రీసెంట్గా తమిళంలో ఆయన నటించిన ‘సినం’ సినిమా సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దాన్ని తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డబ్ చేశాం.యాక్షన్, థ్రిల్లర్, రివేంజ్ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిసిన చిత్రమిది. తప్పకుండా తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.
పల్లక్ లల్వాని హీరోయిన్ గా నటించిన ‘ఆక్రోశం’లో కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేష్, మరుమలార్చి భారతి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు షబీర్ తబరే ఆలం సంగీతం అందించారు.