Arjun’s Daughter Aishwarya Marries in Grand Style: కోలీవుడ్ నటుడు అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో మాత్రమే కాదు తెలుగులో కూడా అర్జున్ చాలా హిట్ సినిమాల్లో నటించారు. ఇక ఈ మధ్య లియో సినిమాలో విజయ్ బాబాయ్ హరాల్డ్ దాస్ గా నటించాడు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య సర్జా కూడా హీరోయిన్ గా కొనసాగుతోంది. ఎప్పటినుంచో ఐశ్వర్య.. కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమను ఇరు వర్గాల కుటుంబ సభ్యులు అంగీకరించగా త్వరలోనే వివాహం జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఇక గత ఏడాది అక్టోబర్లో వీరి ఎంగేజ్ మెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ప్రస్తుతం ఉమాపతి కూడా హీరోగా కొనసాగుతున్నాడు.
Viswak sen : ‘మెకానిక్ రాకీ’ గా వస్తున్న విశ్వక్ సేన్..
వీరి పెళ్ళి డిసెంబర్ లో జరగనుందని ప్రచారం జరిగినా కాస్త లేటుగా జరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం నిన్న జూన్ 10 న చెన్నైలోనీ అంజని సుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఆమె వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఈ పెళ్లి వేడుక ప్రారంభమై , జూన్ 8 సంగీత్ కార్యక్రమం జరుపుకుని, జూన్ 10 న ఉదయం 9 to 10 గంటల మధ్యలో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహ మహోత్సవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నై లీలా ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగనుంది.