యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రామం అందాలు, శ్రీవిష్ణులోని కామెడీ యాంగిల్ తో వినోదాత్మకంగా ఉంది. శ్రీవిష్ణు, ఆయన స్నేహితుల గురించి సుబ్బరాజు విచారిస్తున్న లాడ్జ్ సీక్వెన్స్ ఫన్నీగా ఉంది. ఇక ఈ గ్రూప్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానులు, తారక్ సినిమాల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటారు. అతనికి గ్రామ వాలంటీర్ అయిన అమృత అయ్యర్ అంటే ఇష్టం.
తరువాత వచ్చే కొన్ని ఎన్‌కౌంటర్ సీన్లు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. కథాంశం ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది. కథనం కూడా అంతే. తేజ మార్ని కథను కన్విన్స్‌గా డీల్ చేసినట్లు అన్పిస్తోంది ట్రైలర్ ను చూస్తుంటే… ఓవరాల్‌గా చూస్తే ట్రైలర్ మంచి పెర్ఫార్మెన్స్‌తో పాటు అద్భుతమైన సాంకేతిక అంశాలతో బాగుంది. జగదీష్ చీకాటి సినిమాటోగ్రఫీ, ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేకంగా ఉన్నాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.