ఇన్ స్టాగ్రామ్ వచ్చాక సెలబ్రిటీల సరదా ముచ్చట్లు, ఫోటోలు, వీడియోలు… ఇలా బోలెడు ఫ్యాన్స్ కి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా అర్జున్ కపూర్, జాన్వీ కపూర్ కూడా లిట్టిల్ చిట్ చాట్ చేశారు. ర్యాపిడ్ ఫైర్ అంటూ రకరకాల ప్రశ్నలకి అన్నయ్యా, చెల్లెలు జవాబులు ఇచ్చారు. అయితే, ఎన్నో కొశన్స్ కి క్యూట్, లవ్లీ అండ్ సర్ ప్రైజింగ్ యాన్సర్స్ ఇచ్చారు. ఒక్క సంభాషణ మాత్రం నెటిజన్స్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది…
Read Also : రష్మిక నిర్ణయంతో పేరెంట్స్ అప్సెట్
“జాన్వీకి ఉన్న వింత అలవాటు ఒకటి” అంటూ… అర్జున్ కాస్త బోల్డ్ విషయం ఒకటి చెప్పాడు! మిస్ కపూర్ సూట్ కేసు పట్టుకుని ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేస్తూ ఉంటుందట! ఎక్కడైనా స్నానం చేస్తుందట కూడా! “ఇలాంటి విషయం నేను మాట్లాడొచ్చో లేదో…” అంటూ ముక్తాయింపు కూడా ఇచ్చుకున్నాడు!
అర్జున్ తన గురించి చెప్పిన ‘షవర్ సీక్రెట్’పై జాన్వీ పెద్దగా సీరియస్ ఏం అవ్వలేదు. సరదాగా నవ్వేస్తూ, “మీ ఇంట్లో బాత్రూం ఉందా చెప్పండి? నేను వచ్చేస్తున్నాను!” అంది. చెల్లి స్పోర్టివ్ గా తీసుకోటంతో అర్జున్ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక అర్జున్ లోని ‘వింత, విచిత్ర అలవాటు’ ఏదైనా చెప్పమంటే జాన్వీ ‘ఏమీ లేదు’ అని అన్నయ్యని వెనకేసుకొచ్చింది! అర్జున్ అంతలా ‘మెచ్యూర్డ్’ అంటోంది బెహన్ జీ!