A.R.Rahman: ఆరు నెలలు వెయిట్ చెయ్యాలా… తమిళనాడు గవర్నమెంట్ పై సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మ్యూజిక్ ని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లిన వాళ్లు చాలామంది ఉంటారు కానీ ప్రతి వెస్ట్రన్ ఆడియన్స్ కి మన మ్యూజిక్ ని రీచ్ అయ్యేలా చేసింది రెహమాన్ మాత్రమే. ఇండియాస్ మ్యూజిక్ సూపర్ స్టార్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్న ‘ఇసై పుయల్’ రెహమాన్ గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలని ఇచ్చాడు. ఫీల్ గుడ్ సాంగ్స్, డిఫరెంట్ సౌండ్ మిక్సింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన రెహమాన్ ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు అంటేనే దాన్ని ఎప్పుడెప్పుడు వింటామా అని సంగీత ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆస్కార్ అవార్డ్ ని కూడా గెలుచుకోని వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన రెహమాన్, ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని చోట్లా మ్యూజిక్ కాన్సర్ట్ లు పెడుతూ ఉంటాడు. లక్షల మంది రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ని చూడడానికి వస్తుంటారు.
ఎన్ని దేశాల్లో ఈవెంట్స్ చేసినా రెహమాన్ చెన్నైలో మాత్రం ఈవెంట్స్ చెయ్యట్లేదు. మ్యూజికల్ వరల్డ్ టూర్ లో బిజీగా ఉన్న రెహమాన్ ని ఒక అభిమాని, చెన్నై అనే ఒక ఊరు ఉంది మర్చిపోయారా? అని అడిగాడు. దీనికి సమాధానంగా రెహమాన్ “ఆరు నెలలు పదితుంది చెన్నైలో ఒక షో చెయ్యాలి అంటే. పర్మిషన్స్ ప్రాసెస్ ఆరు నెలలు” అని చెప్పాడు. ఈ కారణంగానే రెహమాన్ చెన్నైలో కాన్సర్ట్ చెయ్యడానికి రెడీగా లేడు. ఆరు నెలలు కేవలం పర్మిషన్స్ కోసమే టైం స్పెండ్ చెయ్యడం అనేది చిన్న విషయం కాదు. రెహమాన్ చెన్నైలో కాన్సర్ట్ ఎందుకు చెయ్యట్లేదు అనే ప్రశ్నకి సమాధానం దొరకడంతో “ఆరు నెలల ప్రాసెసింగ్ టైం ఏంటి? ఇదేమి గవర్నమెంట్?” అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొందరు విమర్శిస్తున్నారు. మరి ఈ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకి ఇన్-డైరెక్ట్ గా కారణం అయిన రెహమాన్, ఈ విషయంపై ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read
Permissions,permissions,permissions 6months process ..✊ https://t.co/Lx2879U75B
— A.R.Rahman (@arrahman) February 8, 2023
తాజావార్తలు
-
Nepal Violence: భారత సరిహద్దులో ఐఎస్ఐ కుట్ర? నేపాల్ అల్లర్లలో పాకిస్థానీ మత గురువు..
-
Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
-
YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
-
Google Pixel 11 Series: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ గ్రాండ్ లాంచ్.. ధరలు, ఫీచర్ల పూర్తి వివరాలు..
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..