తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా హీరో

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్‌ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి రావచ్చు” అని అన్నారు. వైష్ణవ్ తేజ్ చెప్పిన దాని ప్రకారం సాయి ధరమ్ తేజ్ 7-10 రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

Read also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

సెప్టెంబర్ 10 న హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. మాదాపూర్ పోలీసులు సాయి ధరమ్ తేజ్‌పై అతివేగం కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ లో ఆయన కాలర్ బోన్‌లో ఫ్రాక్చర్ అయ్యింది. పలు శస్త్ర చికిత్సల అనంతరం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రాజకీయ డ్రామా ‘రిపబ్లిక్’ 1 న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘కొండపొలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

-Advertisement-తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా హీరో

Related Articles

Latest Articles