Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap High Court Hearing Adjourned Till Monday Over Suspend Of Go 35 On Theatre Ticket Rates

‘పుష్ప’రాజ్ కు షాక్… ఏపీ టికెట్ల వ్యవహారంలో ట్విస్ట్

Published Date :December 16, 2021 , 1:17 pm
By Prakash
‘పుష్ప’రాజ్ కు షాక్… ఏపీ టికెట్ల వ్యవహారంలో ట్విస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది. అయితే హైకోర్టు ఈ విషయంపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

జిఓ 35 ఎందుకు ? టికెట్ రేట్లు ఏంటి ?
రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లలో ప్రజలందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉండాలని, అలాగే టాప్ స్టార్స్ సినిమాల బెనిఫిట్ షోలను ప్రదర్శించే సమయంలో టిక్కెట్ల రేటు భారీగా పెరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఉంది. దానికోసమే ఈ జీవోను తెరపైకి తీసుకొచ్చింది. ఏపీలో ప్రభుత్వం సినిమా థియేటర్లలో ప్రవేశ రేట్లను నిర్ణయిస్తూ 08-04-2021 న జీవో జారీ చేసింది. ఆ జీవో ప్రకారం కనిష్ట టికెట్ ధర రూ. 5 ఉండగా, గరిష్టంగా రూ.250 ఉంది. ఈ ధరలు మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, మునిసిపల్ కార్పొరేషన్ పరిమితులలో మారుతూ ఉంటాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిథిలో థియేటర్లను బట్టి (మల్టీప్లెక్స్, ఏసీ, నాన్-ఏసీ) రేట్లు రూ.40 నుంచి రూ.250 మధ్య, మున్సిపాలిటీ పరిమితుల్లో టికెట్ ధరలు రూ.40 నుంచి రూ.50 మధ్య ఉన్నాయి. నగర పంచాయతీలలో రూ.10 నుంచి రూ.120 వరకు, గ్రామ పంచాయతీలలో రూ. 5 నుంచి రూ. 80 వరకు ఈ టికెట్ రేట్లు ఉన్నాయి.

Read Also : భారీ సంఖ్యలో థియేటర్లలోకి ‘పుష్ప’… బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధం

కోర్టుకు వెళ్ళిందెవరు?
జిఓ 35ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం సస్పెండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. థియేటర్ల యాజమాన్యం తరపున న్యాయవాది దుర్గాప్రసాద్ వాదిస్తూ టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని, అది ఓనర్ల హక్కు అని అన్నారు. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన కోర్టు జిఒను సస్పెండ్ చేసింది. జిఒ 35ను సవాల్ చేస్తూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్‌తో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించే విషయంలో విఫలం అయిందంటూ జిఒ35ను సస్పెండ్ చేసింది. థియేటర్లలో అడ్మిషన్ల రేట్లను నిర్ణయించేందుకు రాష్ట్రహోం ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని గతంలో కోర్టు తన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ప్రభుత్వ నిర్ణయంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ అంశంపై పునరాలోచించాలని కోరారు. పరిశ్రమల పెద్దలు, చిరంజీవి వంటి కొంత మంది స్టార్లు ముఖ్యమంత్రికి, మంత్రి పేర్నికి పరిస్థితి వివరించినా ఫలితం లేకుండా పోయింది. 17న వచ్చే ‘పుష్ప’తో పాటు రాబోయే ‘ఆర్ఆర్ఆర్’ వంటి పెద్ద సినిమాలకు దీనివల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల విడుదలై బాలకృష్ణ ‘అఖండ’ సినిమాకు ఈ టికెట్ రేట్ల వల్ల దాదాపు 8 కోట్ల వరకు నష్టం వచ్చిందని మార్కెట్ లో టాక్. దాంతో కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టులో కేసు ఫైల్ చేయించారు.

కేసు వెనుక ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య!?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఎగ్జిబిటర్స్ చేత కేసు ఫైల్ చేయించింది ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య అనేది బాగా ప్రచారంలో ఉంది. జనవరి 7న విడుదల కాబోయే తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ఈ టికెట్ రేట్లు భారీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే లోకోపకారిగా కొంత మంది ఎగ్జిబిటర్స్ తో కోర్టులో కేసు ఫైల్ చేయించినట్లు టాక్. దానిపై హై కోర్టు కూడా స్పందించి ప్రభుత్వ జీవో 35ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం మళ్ళీ అప్సీలుకు వెళ్ళింది.

Rea also : “పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?

ప్రభుత్వం ఏమంటోంది?

సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, దానిపై విచారణ జరిపి సోమవారానికి వాయిదా వేసింది. ఈ జీవో రద్దు కాకుంటే తమ థియేటర్లు మూసేసుకోవలసి వస్తుందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఎగ్జిబిటర్స్. త్వరలో విడుదల కానున్న బడా చిత్రాల నిర్మాతలు ప్రభుత్వం పట్టుదలకు పోకుండా జీవోను వెనక్కి తీసుకుంటుందేమోనని ఆశగా చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిని ప్రస్టేజ్ గా తీసుకుని ముందుకు వెళుతోంది.

‘పుష్ప’రాజ్ కు నిరాశ
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ డిసెంబర్ 17న విడుదల కానుంది. ఆంధ్రప్రదేవ్ హైకోర్టు గురువారం జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే అది ‘పుష్ప’కు ప్లస్ అయి ఉండేది. విచారణ కాస్తా వాయిదా పడడంతో ‘పుష్ప’రాజ్ కు షాక్ తప్పలేదు. దీని వల్ల ఈ సినిమాకు స్పెషల్ షోస్ ప్రదర్శించుకునే అవకాశం లేకపోగా టికెట్ రేట్లు కూడా పాతపద్ధతిలోనే ఉంటాయి. చివరి నిమిషం వరకూ సినిమా కోసం రాత్రి పగలూ తేడా లేకుండా పని చేస్తున్న చిత్రబృందానికి ఈ ట్విస్ట్ బాగా ఇబ్బందికరమైన విషయం. విచారణ సోమవారానికి వాయిదా పడటం వల్ల తొలి మూడు రోజుల్లో బన్నీ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు తప్పవు. మరి సోమవారం నుంచైనా ‘పుష్ప’రాజ్ కి ఊరట లభిస్తుందేమో చూద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • AP High Court
  • AP Ticket Rates Issue
  • GO 35
  • Pushpa

తాజావార్తలు

  • Yamuna River: యమునా నదిలో ఘోర పడవ ప్రమాదం.. స్పాట్‌లో 9 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

  • Amit Shah: బాబ్రీ మసీదు వాళ్లతో కలవడం కన్నా, 20 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటాం

  • Stock Market: స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్స్.. రికార్డు స్థాయిలో సిప్‌(SIP)లు.. కారణం ఇదే..

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions