Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టరీగా ఉండిపోయిన విషయాల్లో ప్రభాస్- అనుష్క రిలేషన్ ఒకటి. అప్పుడెప్పుడో బిల్లా దగ్గరనుంచి మొదలయ్యింది వీరి మధ్య స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా..? కాదా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు చూస్తూ ఉండలేరు. ఒకరికి సపోర్ట్ గా ఇంకొకరు ఉంటారు. మీడియా ముందు ఇద్దరికి ప్రేమ ఉన్నట్లే కనిపిస్తారు.. కానీ, తామిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తారు. ఇలా ఎన్నాళ్ల నుంచి వీరి మధ్య ఈ రిలేషన్ నడుస్తుందో ఎవ్వరం చెప్పలేం. కృష్ణంరాజు హాస్పిటల్ ఉన్నప్పుడు.. అనుష్క.. ప్రభాస్ దగ్గరే ఉండి చూసుకొంది. ఇక ఇప్పుడు అనుష్క కొత్త సినిమాకు ప్రభాస్ అండగా నిలబడ్డాడు. అంటే ఈ సినిమా ప్రభాస్ దే అనుకోండి.. అది వేరే విషయం. అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అనుష్క ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Anil Sunkara: తప్పు చేశాం.. క్షమించండి.. ‘ఏజెంట్’ ఫెయిల్యూర్ ను ఒప్పుకున్న నిర్మాత
ఇక ఈ టీజర్ ను షేర్ చేస్తూ ప్రభాస్, అనుష్కకు, చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ తెలిపాడు. ఇక ప్రభాస్ విషెస్ కు స్వీటీ ఎంతో స్వీట్ గా రిప్లై ఇచ్చింది. ” థాంక్యూ..పుప్సూ” అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో ప్రభాస్ ముద్దు పేరు రివీల్ అయ్యిపోయింది. అనుష్క, ప్రభాస్ ను ముద్దుగా పుప్సూ అని పిలుస్తుందని తెలియడంతో అభిమానులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. డార్లింగ్ నిక్ నేమ్ బావుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాకుండా ఈ జంట పెళ్లి చేసుకుంటే చూడముచ్చటగా ఉంటుంది అని, డార్లింగ్ ను స్వీటీ మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటుందని చెప్పుకొస్తున్నారు. మరి.. ఈ ఇద్దరు బ్యాచిలర్స్ మనసులోఏముందో తెలియాలి.