Baahubali Epic : బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి ఎపిక్ పేరుతో రెండు సిరీస్ లను కలిపి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టులను కలిపేందుకు జక్కన్న ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. బాహుబలి నటీనటులతో మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్లతో ట. పాటు.. ఇప్పటి వరకు బయట పెట్టని కొన్ని విషయాలను ఇంటర్వ్యూలో చెప్పిస్తున్నాడంట.
Read Also : Komali Prasad : దాని కోసం లిప్ లాక్ ఇస్తా.. నటి షాకింగ్ కామెంట్స్
ఇందుకు సంబంధించిన షూటింగ్స్ కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. కాగా బాహుబలి కోసం అనుష్కశెట్టిని రంగంలోకి దించుతున్నాడంట జక్కన్న. ఆమె ఘాటీ ప్రమోషన్లకు చాలా దూరంగా ఉంది. దానికి రకరకాల కారణాలు వినిపించాయి. కానీ ఇప్పుడు బాహుబలి కోసం ఆమెను బయటకు తీసుకురావడం కూడా సంచలనంగానే మారుతుందని జక్కన్న భావిస్తున్నాడు. మళ్లీ బాహుబలి సిరీస్ నాటి రోజులను ఇండస్ట్రీలో క్రియేట్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్. వ్యూహాలు పన్నడంలో రాజమౌళ దిట్ట. మరి ఈ సారి ఎలాంటి ప్రమోషన్లతో అదరగొడుతాడో చూడాలి.
Read Also : Srinidhi Shetty : ప్రభాస్ మీద శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్.. ఇలా అనేసిందేంటి..