Anushka Sharma: బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక టాపిక్ లో అనుష్కను సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేస్తుంటారు. ఇక తాజాగా మరోసారి అనుష్క ట్విట్టర్ ట్రెండింగ్ లో నిలిచింది. ఎందుకంటే.. తాజాగా అనుష్క తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆరు బయట బెంచీపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తోంది. వైట్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె కాళ్లపై ఎండ పడుతూ మెరుస్తూ కనిపించాయి. అయితే ఇక్కడివరకు బాగానే ఉన్నా కొంతమంది నెటిజన్స్ ఈ ఫోటోను బాగా తీక్షణంగా పరిశీలించి ఒకటి గమనించారు.
అదేంటంటే.. చూడడానికి ఆమె కాళ్లు, చేతులు ఒకే ఆకారంలో ఉన్నాయట. సన్నని పత్తి కర్రలుగా వేలాడుతూ కనిపిస్తున్నాయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయినా ముద్దుగా, అంత అందంగా అనుష్క కనిపిస్తుంటే.. వంకలు వెతికి ట్రోల్ చేయడానికి రెడీ అయ్యారు అంటూ విరుష్క ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనుష్క కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చక్ దే ఎక్స్ప్రెస్ సినిమా లో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.