2025 అంటే మలయాళ కుట్టి ‘అనుపమ పరమేశ్వరన్’దే. ఒక్కటి కాదు రెండు కాదు.. ఆరు సినిమాలతో సందడి చేశారు. అందులో నాలుగు బ్లాక్ బస్టర్స్ ఉండడం విశేషం. ‘డ్రాగన్’తో స్టార్ట్ చేసిన హిట్స్ పరంపరను.. ‘బైసన్’ వరకు కంటిన్యూ చేశారు. ముగ్గురు ఫ్లాప్ హీరోలకు అను లైఫ్ ఇచ్చారు. ‘కిష్కింధ పురి’తో బెల్లకొండ సాయి శ్రీనివాస్‌కు కంబ్యాక్ అయితే.. కెరీర్ ఎటు పోతుందో తెలియక డైలామాలో పడిపోయిన స్టార్ కిడ్ ధ్రువ్ విక్రమ్‌కు ‘బైసన్’ రూపంలో బిగ్గెస్ట్ హిట్ అందించారు. ‘పెట్ డిటెక్టివ్’తో మలయాళ హీరో షరీఫ్ యూధీన్కి అటు హీరోగా, ఇటు నిర్మాతగా డబుల్ బొనాంజా అందించారు.
ఫ్లాప్స్‌లో ఉన్న హీరోలను గట్టెక్కించగలిగింది కానీ.. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో అనుపమ పరమేశ్వరన్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు. ఈ ఏడాది ఆమె నటించిన రెండు లేడీ ఓరియెంట్ చిత్రాలు ‘పరదా’, ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ బోల్తా పడ్డాయి. ఇక వీటి జోలికి వెళ్లకూడదు అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా లాస్ట్ ఇయర్ కంప్లీటైన తమిళ ఫీమేల్ సెంట్రిక్ చిత్రం ‘లాక్ డౌన్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ ఫిల్మ్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒక్కసారిగా డిసెంబర్ రేసులోకి వచ్చిన ఈ సినిమాపై పెద్దగా బజ్ క్రియేట్ కావడం లేదు. సినిమాపై కాస్తంత కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు ఆడియన్స్. ట్రైలర్ కూడా ఇంటెన్సిటీ క్రియేట్ చేయలేదు.
Also Read: Dharma Productions: యువ హీరోని విడిచిపెట్టని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. వరుసగా సినిమా ఛాన్స్‌లు!
లైకా ప్రొడక్షన్ నుంచి మూవీ వస్తుందంటే ప్రమోషన్లు వేరే లెవల్లో ఉంటాయి. కానీ ఎక్కడా ప్రమోషన్లు చేసిన దాఖలాలు కూడా లేవు. సందడి, హడావుడి లేకుండా యూట్యూబ్‌లో ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు మేకర్స్. అనుపమ పరమేశ్వరన్ కూడా ఎక్కడా కనిపించకపోవడంతో పాటు తన సినిమాను సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేసుకోకకపోవడంతో ‘లాక్ డౌన్’ను నామ్ కే వాస్తేకు రిలీజ్ చేస్తున్నారన్న డౌట్స్ కలుగుతున్నాయి. రిజల్ట్ ముందే ఊహించి ప్రమోషన్స్ చేయడం వేస్ట్ అనుకుందో ఏమో అనుపమ. మొత్తానికి లాక్ డౌన్ మూవీని అను లైట్ తీసుకున్నట్లే కనిపిస్తోంది.