Anupama : అనుపమ పరమేశ్వరన్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ల కలల రాణిగా వెలుగొందుతోంది. అలాంటి అనుపమ తన ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోందా అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా సంస్థలు. ఆమె ఓ స్టార్ హీరో కొడుకుతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా అతనితో ఆమె లిప్ లాక్ చేసిన ఫొటో కూడా లీక్ కావడం సెన్సేషనల్ గా మారిపోయింది. ఇంతకీ అతను ఎవరో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ ప్రైవేట్ ప్లేస్ లో లిప్ లాక్ చేసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
Read Also : Telangana : విద్యార్థులకు వరుస సెలవుల మేళా.. మరో గుడ్ న్యూస్!
అది చూసిన వారంతా అనుపమ అతనితో నిజంగానే డేటింగ్ లో ఉందా అంటూ ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. అయితే అనుపమ, ధృవ్ కలిసి బైసన్ సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో అనుపమ ధృవ్ ప్రియురాలిగా నటిస్తోంది. ఈ లిప్ లాక్ ఫొటో కూడా ఆ సినిమాలోనిదే కావచ్చేమో అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరూ ప్రైవేట్ గా తిరుగుతున్నారేమో అంటూ చర్చించుకుంటున్నారు. వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయిందేమో అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా అనుపమ దీనిపై క్లారిటీ ఇస్తేగానీ ఈ రూమర్లు ఆగేలా లేవు.
. Dhruv vikram & Anupama dating pics ! pic.twitter.com/yLey0wG0sU
— Kolly Censor (@KollyCensor) April 12, 2025