Anupam Kher: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల సంచలనం సృష్టించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాల్లో కాశ్మీర్ పండితుడిగా నటించి మెప్పించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 లో కూడా ఒక అద్భుతమైన పాత్రను పోషించి శభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ నటుడు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో బాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఇండస్ట్రీ కథను నమ్ముకొంటే బాలీవుడ్ మాత్రం స్టార్స్ ను అమ్ముకొంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
“ఒక సినిమాను తీస్తున్నాము అంటే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీయాలి. సినిమాలు చూసే ప్రేక్షకులను గౌరవించాలి. వారిని తక్కువ చూసినప్పుడే సమస్య మొదలవుతోంది. ఒక సినిమా కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అది విజయం అందుకొంటుంది. నేను సౌత్ ఇండస్ట్రీతో పనిచేశాను. ఇటీవలే కార్తికేయ 2 లో చేశాను. ప్రస్తుతం తమిళ్, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను. అక్కడ వీరందరూ కథను నమ్ముకొని సినిమా తీస్తున్నారు. కానీ బాలీవుడ్ మాత్రం స్టార్లను అమ్ముతోంది” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పలు బాలీవుడ్ మీడియా అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి వీటిపై అనుపమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.