యంగ్ హీరో రాజ్ తరుణ్ తన నెక్స్ట్ మూవీ “అనుభవించు రాజా”పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మేకర్స్ సినిమా విడుదలకు ముందే జోరుగా ప్రచారం చేస్తున్నారు. నాగార్జున, రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను లాంచ్ చేశారు. నాగ చైతన్య ఈ రోజు సినిమాలోని మొదటి పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ రాజ్ తరుణ్ క్యారెక్టరైజేషన్‌ను స్పష్టంగా చూపించే టైటిల్ ట్రాక్. జీవితంలో ఎలాంటి టెన్షన్‌లు లేకుండా సంతోషంగా ఉండే రాజులా రాజ్ తరుణ్ ఈ సాంగ్ లో కనిపిస్తున్నాడు. ఈ సాంగ్ కు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, గోపి సుందర్ మాస్ నంబర్ కు ట్యూన్స్ అందించారు. రామ్ మిరియాలా పాడిన ఈ మాస్ సాంగ్ ఎనర్జిటిక్ గా ఉంది.
Read Also : ‘మా’ సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా
ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన కాశిష్ ఖాన్ కథానాయికగా నటించింది. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనుభవించు రాజా’ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.