Bichhagadu 2: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. తనకు మంచి హిట్ ను తీసుకొచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు విజయ్.