Anshu Ambani: ‘మన్మథుడు’ బ్యూటీ ఏంటి ఇలా మారిపోయింది.. గుర్తుపట్టలేమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anshu Ambani:గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తోంది.. పెదవుల్లో నీ మౌనం నా పేరే పిలుస్తోంది.. అని మన్మథుడు సినిమాలో నాగ్ తో చిందేసిన చిన్నది గుర్తుందా.. పోనీ, నీ స్టైలే నాకిష్టం.. నీ స్టైలే నా ప్రాణం.. నువ్వు నాకోసం.. ఇక సంతోషం అంటూ ప్రభాస్ తో స్టెప్ వేసిన ముద్దుగుమ్మ తెలియకుండా ఉండదు.. హా.. ఆమె అన్షు అంబానీ. 2002 లో మన్మథుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అన్షు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఆ తరువాత ఇండస్ట్రీని ఏలేస్తోంది అనుకున్నారు. కళ్లలో అమాయకత్వం.. ముగ్ధ మనోహర రూపం.. అరుదైన హీరోయిన్ గా మంచి పేరును అయితే సంపాదించుకుంది కానీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోయింది. కేవలం రెండు మూడు సినిమాలకే పరిమితమైపోయింది. అయితేనేం.. ఇప్పటికీ ఈ చిన్నది అంటే అందరికి ఇష్టమే. ఎంతో ముద్దుగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
Ustad Bhagat Singh: పవన్ సరసన శ్రీలీల.. హమ్మయ్య పూజా లేదు సంతోషం..?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమా చేసిన తరువాత ఆమె సచిన్ సాగర్ అనే వ్యాపారవేత్తను వివాహామాడి లండన్ కు వెళ్ళిపోయింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లో అడపాదడపా కనిపించినా కొన్నేళ్ళకు లండన్ లోనే సెటిల్ అయిపోయింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు అని సమాచారం. ప్రస్తుతం ఆమె అక్కడే మంచి గృహిణిగా ఉంటుంది. సినిమాల్లో లేకపోయినా నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను తన కుటుంబ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. అయితే.. అప్పటికి, ఇప్పటికి అన్షులో చాలా మార్పులు వచ్చాయి. అమ్మడితో మునుపటి అందం అయితే లేదు. బక్కచిక్కి కనిపించినా ముఖంలో ఆ కళ అయితే లేదు. ఎవరైనా అమ్మడిని చూస్తే మన్మథుడు లో ఉన్న హీరోయిన్ నువ్వా..? నోనో మేము నమ్మం అనేస్తారు. ముఖం మొత్తం లోపలికి పోయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ లండన్ లో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఏదిఏమైనా అప్పటి అన్షును మిస్ అవుతున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..