గతేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన వార్త ఏది అంటే అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకుల న్యూస్ మాత్రమే.. ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోయారు. అయితే విడిపోక ముందు సుమారు 4, 5 నెలల వరకు వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయే తప్ప ఇద్దరిలో ఎవరు అధికారికంగా విడిపోతున్నట్లు చెప్పలేదు. వీరి గురించి ఎన్నో పుకార్లు, చర్చలు జరిగి ఇరు కుటుంబాల నిర్ణయమో , లేక ఈ జంట ఇష్టానుసారేమో అనుకోకుండా ఒక రోజు విడాకులు తీసుకుంటున్నట్లు బాంబ్ పేల్చారు. అయితే విడాకుల మాట పక్కనపెడితే ప్రస్తుతం మరో స్టార్ జంట ఇలాగే స్ట్రగుల్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు.. ఖాన్ల కుటుంబం నుంచి వచ్చిన ఇమ్రాన్ ఖాన్- అవంతిక మాలిక్.
అమీర్ ఖాన్ కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో ఒకప్పుడు అమ్మాయిల ఫెవరేట్.. అవంతిక మాలిక్ ని వివాహమాడిన ఈ హీరో కొన్నేళ్లు కలతలు లేకుండానే వైవాహిక బంధాన్ని కొనసాగించాడు. అయితే గత రెండేళ్ల నుంచి ఈ జంట మధ్య విభేదాలు మొదలయ్యాయి అని, ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో కొత్తేమి లేదు.. ఎప్పటినుంచో ఈ వార్తలు వాస్తు ఉన్నాయి కానీ ఈ జంట స్పందించింది లేదు. అస్సలు వీరు కలిసి ఉంటున్నారా..? విడాకులకు అప్లై చేశారా..? అనేది కూడా తెలియదు. అయితే ఇటీవలే ఈ రెండు కుటుంబాలు వీరి బంధం గురించి చర్చ జరపడం, ఇమ్రాన్ తో కలిసి ఉండబోయేది లేదని అవంతిక చెప్పడం, అందుకు ఇమ్రాన్ కూడా ఓకే అనడంతో పెద్దలు కూడా మారుమాట్లాడకుండా వెళ్లిపోయారట. కాబట్టి ఇమ్రాన్ – అవంతికల వివాహం ఇప్పుడు ముగిసిన అధ్యాయం అన్న చర్చా బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కేవలం అధికారిక ప్రకటన ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. సామ్- చై లు కనీసం అధికారికంగా ప్రకటించి క్లారిటీ ఇచ్చారు.. వీరు అది కూడా ఇవ్వడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ జంట కలుస్తుందా..? వీడిపోతుందా అనేది కాలమే చెప్పాలి.