Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో .. ఇంకోపక్క వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉంది. సామ్ .. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే లూయిస్ విట్టన్ అనే ఇంటర్నేషనల్ బ్యాగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఇక తాజాగా ఆమె ఖాతాలోకి టామీ హిల్ ఫిగర్ వచ్చి చేరింది. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ ప్రకటనల్లో సామ్ కనిపించనుంది. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనుంది. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఆమెకు సంబంధించి యాడ్స్ ను అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగనుంది. టామీ హిల్ ఫిగర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్స్ ఈసారి అద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక టామీ హిల్ ఫిగర్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంపై మోవాడా గ్రూప్ ప్రెసిడెంట్ రిచర్డ్ సీజర్ మార్టిన్స్ హర్షం వ్యక్తం చేశారు. టామీ బ్రాండ్ సమ్మర్ 2023 వాచ్ కలెక్షన్ను సమంతతో కలసి ప్రవేశపెడుతున్నందుకు ఉద్విగ్నంగా అలాగే గర్వంగానూ ఉందని చెప్పుకొచ్చారు.
Allu Arjun: చీరకట్టిన అల్లు అర్జున్.. నీ ధైర్యానికి జోహారయ్యా
సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్ఫైయర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్ఫైయర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఇందులో సమంతకు నటించే అవకాశం లభించింది. ఆమెకు సంబంధించి యాడ్స్ను అమితాబ్ కామే చిత్రీకరించనున్నారు. ఈ షూటింగ్ ముంబైలో జరగనుంది. టామీ హిల్ఫైయర్ నుంచి రాబోతున్న విమెన్ కలెక్షన్ వాచ్ల్లో ఈసారి వైవిధ్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. స్టైల్తో పాటు రోజువారీ జీవితంలో వాడేలా సింపుల్గానూ అలాగే స్పోర్టీగానూ వాచ్లను డిజైన్ చేశారు. ఈ సీజన్ తమ వారసత్వాన్ని భవిష్యత్తులో ఎలా కొనసాగిస్తామనే దానికి తార్కాణంగా నిలవబోతోందన్నారు. సరికొత్త డిజైన్లు, నూతన రంగుల్లో ఉత్పత్తులను అందించడం టామీ సంస్థ ప్రత్యేకత అని రికార్డో సీజన్ పేర్కొన్నారు. సమంతలాగే ఈ కొత్త వాచ్లు కూడా డిజైన్, రంగు, నాణ్యతలో ఎంతో అపూర్వమని వ్యాఖ్యానించారు.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్- అభిషేక్ బచ్చన్ విడాకులు..?
ఇక తనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంపై సమంత స్పందించింది. టామీ ఫ్యామిలీలో భాగమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, వ్యక్తిగత అందంలో గడియారాలను ఒక భాగంగా తాను చూస్తానని చెప్పుకొచ్చింది. టామీ సంస్థ ఒక గ్లోబల్ బ్రాండ్ అని, ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత స్టైల్, డిజైన్ ఉండేలా ఈ కంపెనీ ఉత్పత్తులను అందిస్తుందని సమంత ప్రశంసలు కురిపించింది. ఈ సంస్థ వాచ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని.. ఇవి తన వైవిధ్యమైన లుక్స్ కు సరిగ్గా సరిపోతాయని తెలిపింది. టామీ నుంచి వస్తున్న స్ప్రింగ్ సమ్మర్ వాచ్లు తనకు ఎంతో నచ్చాయని.. వీటిని అందరికీ పరిచయం చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సమంత తెలిపింది.