Anjali: అచ్చతెలుగు హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పక్క హీరోయిన్ గా చేస్తూనే.. ఇంకోపక్క కీలక పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నది గ్యాంగ్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.. ఇది కాకుండా శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్ మొదలుపెట్టింది. అమ్మడి కెరీర్ లో వివాదాలు కూడా చాలానే ఉన్నాయి. హీరో జై తో ఎఫైర్.. పెళ్లి, రూమర్స్, కిడ్నాప్.. ఇలా చాలా రూమర్స్ ఆమె జీవితంలో ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఈ చిన్నది మీడియా ముందుకు రాకపోయేసరికి.. ఒక బిజినెస్ మ్యాన్ ను వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యిందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అంజలి ఈ పుకార్లు అన్నింటికి క్లారిటీ ఇచ్చింది.
” నాకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎవరిని కలిసినా.. మాట్లాడినా కూడా ఏదో ఒక ఎఫైర్ అంటగడుతున్నారు. ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారు. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారు. ఇప్పుడు మరో బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యినట్లు రాస్తున్నారు. నాకే తెలియకుండా నా పెళ్లి చేస్తుంటే.. నాకే నవ్వు వస్తోంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తన ఫోకస్ మొత్తం కెరీర్ మీదనే ఉందని, పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అందరికి చెప్పే చేసుకుంటాను అని కూడా చెప్పుకొచ్చింది. మరి అంజలి .. గేమ్ ఛేంజర్ తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకుంటుందా.. ? లేదా ..? అనేది చూడాలి.