అనిరుధ్.. ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ మేకర్స్ అంతా జపం చేస్తున్న పేరు ఇదే. ఈ యంగ్ సెన్సేషన్ ఇచ్చే మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు నెక్స్ట్ లెవల్ అనే మాట కూడా సరిపోదు. సాంగ్స్ విషయాన్ని పక్కకు పెడితే ఒక్కో సినిమాకు అనిరుధ్ ఇస్తున్న బీజిఎం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ బీజిఎం ఇచ్చిన సినిమా ఏదైనా ఉందా? అంటే, అది విక్రమ్ సినిమా అనే చెప్పాలి. కమల్ హాసన్ అప్పులన్నీ తీరేలా విక్రమ్ సినిమాకు అదిరిపోయే స్కోర్ ఇచ్చాడు అనిరుధ్. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్‌ను అయితే ఎక్కడ లేపాలో అక్కడ లేపి… తలైవా ఫ్యాన్స్ చేత జేజేలు కొట్టించుకుంటున్నాడు. జైలర్ సినిమాలో ఏదైనా సీన్ వీక్‌గా ఉన్నా సరే అనిరుధ్ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉందని సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
అసలు జైలర్ సినిమాను అనిరుధ్ బీజిఎం లేకుండా ఊహించుకోలేం అనేలా గూస్ బంప్స్ తెప్పించాడు అనిరుధ్. అలాంటి ఈ యంగ్ టాలెంట్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఇచ్చే ఎలివేషన్ ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి అంటూ నందమూరి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మామూలుగానే కొరటాల శివ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి డైరెక్టర్‌కు అనిరుధ్ తోడైతే… బాక్సాఫీస్ దగ్గర దేవరను తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ఇప్పటికే… కోస్టల్ ఏరియాలో నా దేవర చేసే మృగాల వేట ఎలా ఉంటుందో చూపిస్తానని… చెబుతున్నాడు కొరటాల. అందుకే ఇప్పుడు దేవర సినిమాకు అనిరుధ్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మరి దేవర ఏం చేస్తాడో చూడాలి.