Animal movie team at Unstoppable with NBK Episode: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బికే ఇప్పటికే విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుని ఇప్పుడు మూడవ సీజన్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఇప్పటికీ ఈ సీజన్ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ రిలీజ్ అయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లతో ఈ మొదటి ఎపిసోడ్ అంతా సాగిపోయింది. ఇప్పుడు రెండవ ఎపిసోడ్ షూటింగ్ కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రెండు ఎపిసోడ్లో యానిమల్ మూవీ టీం పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను తెలుగులో అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో డిసెంబర్ ఒకటో తేదీన రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున చేస్తోంది సినిమా యూనిట్.
Karthika: పెళ్లి పీటలు ఎక్కుతున్న దమ్ము హీరోయిన్.. దర్శకేంద్రుడుకు ఆహ్వానం
అందులో భాగంగానే తెలుగులో నందమూరి బాలకృష్ణ షో తో కనుక ప్రేక్షకుల ముందుకు వస్తే మరింత బూస్టప్ అవుతుందని భావించి ఈ మేరకు ఆహా టీం తో సంప్రదింపులు జరిపిందని దానికి ఆహా టీం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ యానిమల్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగినట్టుగానే టీజర్ సహా ట్రైలర్ కూడా బాగుండడంతో సినిమా ఎలా ఉండబోతుందని దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపద్యంలో సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్ కాంబినేషన్ మీద కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.