ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఒక A రేటెడ్ సర్టిఫికేట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్‌ని రాబట్టొచ్చా? అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ రిలీజ్ అయి రెండు వారాలు కంప్లీట్ అయినా కూడా… థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే 717 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అనిమల్ సినిమా… మొదటి మండేకే స్లో అవుతుంది అనుకున్నారు కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ సెన్సేషనల్ కలెక్షన్స్‌ని రాబడుతోంది.
లేటెస్ట్‌గా సెకండ్ మండే, ట్యూస్ డే కూడా 20 కోట్లు కొల్లగొట్టిన అనిమల్ సినిమా ఓవరాల్ గా నిన్నటి బుకింగ్స్ తో కలిపి మొత్తంగా 13 రోజుల్లో 772.33 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా రోజుకి 15-20 కోట్లకు ఏ మాత్రం తగ్గడం లేదు అనిమల్. ఇది కొత్త హిస్టరీ అనే చెప్పాలి. A రేటెడ్ సినిమా.. మూడున్నర గంటల నిడివి ఉన్నా కూడా… ఈ రెండు నెగటివ్ విషయాలు అనిమల్ సినిమా కలెక్షన్స్‌ని ఆపలేకపోతున్నాయి. ఇక ఈరోజు నుంచి మళ్లీ వీకెండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అనిమల్ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. రాబోయే మూడు రోజుల్లో అనిమల్ సినిమా ఎంత రాబడుతుంది అనే దానిపైనే అనిమల్ క్లోజింగ్ కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇది చాలదన్నట్లు అనిమల్ సినిమా డిసెంబర్ 21న డంకీ రిలీజ్ అయ్యే వరకూ అపోటీనే. సో ఈ వారమే కాదు వచ్చే వారం కూడా అనిమల్ సినిమాదే హవా… ఈ 7 రోజుల్లో రోజుకి పది కోట్లు వేసుకున్నా అనిమల్ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఇంకో వంద పెరగడం గ్యారెంటీ.
The box office beast #Animal roars on 🪓💥
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol… pic.twitter.com/W5HnDbGSzW
— Animal The Film (@AnimalTheFilm) December 14, 2023