Chiranjeevi : అనిల్ రావిపూడి తన హడావిడితో విశ్వంభర మూవీని డామినేట్ చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు. వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమాతో పాటు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ మూవీ చేస్తున్నాడు. అయితే అనిల్ రావిపూడితో మూవీ మొదలు కాక ముందు వశిష్టతో చేస్తున్న విశ్వంభర మూవీపై మంచి బజ్ ఉండేది. అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు. పైగా అది భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఆ మూవీని ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచే కథ వేరే అయిపోయింది.
Read Also : Bigg Boss : బిగ్ బాస్ లో నటి ఆత్మహత్యాయత్నం.. బయట పెట్టిన మేనేజ్ మెంట్..
అనిల్ రావిపూడి తన హైపర్ యాక్టివ్ తో అందరి చూపు తన సినిమాపై పడేలా చేసుకున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచే ప్రమోషన్లతో హైప్ పెంచడం అనిల్ స్పెషాలిటీ. మూవీ షూటింగ్ అయిపోయాక ప్రమోషన్లు చేయడం కామన్. కానీ మూవీ మొదలైనప్పటి నుంచే క్రియేటివ్ వీడియోలతో హైప్ పెంచడం అని స్పెషాలిటీ. ఇప్పుడు చిరు మూవీకి కూడా ఇలాంటి క్రియేటివ్ వీడియోలతో హైప్ పెంచేశాడు. దెబ్బకు చిరంజీవి సినిమా అంటే ఇప్పుడు అందరికీ అనిల్ తో చేసే మూవీ అనేలా ముద్ర పడిపోయింది. దెబ్బకు విశ్వంభర పక్కకు పోయింది. ఆ మూవీ నుంచి అప్డేట్లు కూడా రాకపోవడం ఇంకో మైనస్. ఇలా అనిల్ ప్రమోషన్లతో విశ్వంభరను డామినేట్ చేసేశాడని అంటున్నారు నెటిజన్లు.