పటాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పటివరకు ఆయన తీసిన 6 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే.. కామెడీ టైమింగ్, ఎమోషన్స్ తో అనిల్ సినిమాలు ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఏడిపించేస్తాయి కూడా.. ఇక ఇటీవలే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రం ఎఫ్3.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 27 న రిలీజై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కలెక్ట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.. ఈ వేడుకలో అనిల్ రావిపూడి ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
“ఏది మాట్లాడినా యూట్యూబ్ లో థంబ్‌నేయిల్స్ పెడుతూ ఉంటారు.. ఇప్పుడు నేను చెప్పేది థంబ్‌నేయిల్స్ పెట్టుకోండి.. నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి.. ఒకటి ఇంటి దగ్గర నా భార్య, కుటుంబం.. రెండోది నా చిత్ర బృందం.. సెట్ లోకి వెళితే వారే నా కుటుంబం.. ఇక మూడో ఫ్యామిలీ నా ప్రేక్షకులు.. నన్ను , నా చిత్రాన్ని ఆదరించినందుకు వారికెప్పుడు రుణపడి ఉంటాను. కరోనా తరువాత ‘అఖండ’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘భీమ్లానాయక్’, ‘సర్కారు వారి పాట’ లాంటి చిత్రం ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించాయి.. ఇప్పుడు ‘ఎఫ్3’ వంతు వచ్చింది. మా సినిమా నైజాంలోనే తొమ్మిది లక్షల యాభైవేలమంది ప్రేక్షకులు చూశారు. తెలుగు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్” అని అనిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.