సంక్రాంతి టాలీవుడ్‌లో అసలైన కీలక సీజన్. ఈసారి పండగ బరిలో ఐదు స్ట్రైట్ సినిమాలు, రెండు డబ్బింగ్ చిత్రాలు ఉన్నప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఇద్దరి మీదే ఉంది. ఒకరు మాస్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరొకరు ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వీరిద్దరి మధ్య ప్రమోషన్ల యుద్ధం పీక్స్‌కు చేరుకుంది. సాధారణంగా సినిమాలకు హీరోలు ప్రమోషన్లు చేస్తారు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి తానే ఒక హీరోలా రంగంలోకి దిగారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అనిల్ రావిపూడి తన సినిమాల ఈవెంట్లలో డ్యాన్స్‌లు చేయడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు నవీన్ పోలిశెట్టి.
Also Read:Dutt Sisters: క్యాషియర్లు కాదు.. క్రియేటర్లు.. ‘ ఛాంపియన్’ సిస్టర్స్!
‘అనగనగా ఒక రాజు’ సినిమా కోసం నవీన్ పోలిశెట్టి ఊరూరా తిరుగుతూ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతారతో కూడా అనిల్ రావిపూడి వీడియోలు చేయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం అనిల్ రావిపూడి మాత్రమే కాదు, ఈ సంక్రాంతికి వస్తున్న మరో సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ దర్శకుడు కిషోర్ తిరుమల కూడా తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీశారు. మూడవ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. అంటే, ఇప్పుడు సినిమా హిట్టవ్వాలంటే డైరెక్టర్‌కు 24 క్రాఫ్ట్స్ మాత్రమే కాదు.. డ్యాన్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట!
Also Read:Peddi : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్!
ఇంత హడావుడి చేస్తున్న ఈ ఇద్దరూ ఒక విషయంలో మాత్రం వెనుకబడిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే ‘టీజర్’. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ కానీ, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కానీ ఇంతవరకు టీజర్‌ను విడుదల చేయలేదు. పాటలతోనే కాలక్షేపం చేస్తూ, అసలు సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో చూపించే టీజర్‌ను స్కిప్ చేసేశారు. టీజర్లు లేకపోయినా, అనిల్ రావిపూడి ఏకంగా జనవరి 4న ట్రైలర్‌తో నేరుగా దాడికి సిద్ధమయ్యారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వస్తేనే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అటు నవీన్ పోలిశెట్టి కూడా ట్రైలర్‌తోనే తన కామెడీ పవర్ చూపించబోతున్నారు. మొత్తానికి ప్రమోషన్లలో డ్యాన్సులతో మెప్పించిన ఈ ఇద్దరిలో, వెండితెరపై ఎవరు ఎక్కువ నవ్విస్తారో.. ఎవరికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.
