పటాస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తన ప్రతి సినిమాలోనూ కామెడీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ జనరేషన్ కు జంధ్యాల అని అనిపించుకున్న ఈ డైరెక్టర్ తాజాగా ‘ఎఫ్3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో పాల్గొన్న అనిల్ తన కాలేజ్ రోజులను గుర్తుచేసుకున్నాడు.
“కాలేజ్ లో మాది ఒక పెద్ద బ్యాచ్.. కాలేజ్ అయిపోగానే మా బ్యాచ్ అందరం కలిసి మరో నలుగురు అమ్మాయిల బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్ళం.. అందులో ఒక అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం. ఒక రకంగా చెప్పాలంటే రోజు నేను ఆ అమ్మాయికి సైట్ కొట్టేవాడిని.. కట్ చేస్తే ఆ తరువాత నాకు ఆ బ్యాచ్ లో అమ్మాయితో పెళ్లి అయ్యింది. అయితే నేను చూసిన అమ్మాయి కాదు.. తన ఫ్రెండ్ తో.. అంటే ఇప్పడూ నా భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే.. నా భార్య పడింది. ఇప్పటికి ఆమె నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది. నా ఫ్రెండ్ కు నువ్వు సైట్ కొట్టావని.. మా ఇద్దరికీ రోజూ ఏదో ఒక చిన్న విషయమై గొడవ జరుగుతూనే ఉంటుంది. ‘ఎఫ్ 2’ సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా తన రియల్ లైఫ్ లోనివే.. ఇక ‘ఎఫ్3’ లో అందరి ప్రాబ్లమ్ డబ్బు గురించి చూపిస్తున్నా” అని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.