Anchor Suma: యాంకర్ సుమ ఇటీవలే అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తాను యాంకరింగ్ కు కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ఒక షో ప్రోమో లోచెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమ లేని షోస్ ను, ఇంటర్వూస్ ను ఉహించుకోలేమంటూ చెప్పుకొచ్చారు. అయితే అదంతా తూచ్.. ఉత్తిత్తినే అని మరోసారి షాక్ ఇచ్చింది సుమ.. యాంకరింగ్ కు సుమ బ్రేక్ అనగానే ప్రతి ఒక్కరు అలాంటి నిర్ణయం తీసుకోద్దని కామెంట్స్ పెడుతుండడంతో సుమ దీనిపై స్పందించింది.
ఒక వీడియో ద్వారా సుమ మాట్లాడుతూ.. “రీసెంట్ గా నేను న్యూయార్ షో లో పాల్గొన్నాను. అందులో ఎమోషనల్ అయిన విషయం నిజమే..అయితే షో మొత్తం చుస్తే మీకు తెలుస్తుంది. నేను టీవీ కోసం ఎంటర్ టైన్ మెంట్ కోసమే పుట్టా. నేను ఎక్కడికి వెళ్లను. కాబట్టి మీరు హ్యాపీగా వుండండి. హ్యాపీ న్యూ ఇయర్” అని చెప్పుకొచ్చింది. దీంతో సుమ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా సుమ కొనసాగుతోంది. హీరోయిన్లను మించి రెమ్యూనిరేషన్ అందుకుంటున్న యాంకర్ గా సుమకు మంచి పేరు ఉంది.