Anasuya: నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి రచ్చ అంతా ఇంతా ఉండదు. తనమీద ఎవరైనా విమర్శలు గుప్పిస్తే అస్సలు ఊరుకోదు. తనదైన పద్దతిలో ఇచ్చి పడేస్తుంది. ఇప్పటివరకు అమ్మడు ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. ఆంటీ వివాదం, ది దేవరకొండ వివాదం.. ఇలా ఎన్నో సార్లు ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా స్ట్రాంగ్ గా నిలబడి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఇరాక్ క్షణం సినిమాతో ఈ భామ నటిగా అడుగులు వేసింది. అందులో విలన్ గా ఆమె నటన విమర్శకులను సైతం మెప్పించింది. అయితే ఈ సినిమా చేయకముందు అనసూయ మనసులో చాలా అపోహలు ఉన్నాయట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవన్నీ చెప్పుకొచ్చింది.
Kotabommali PS Teaser: శ్రీకాంత్ నట విశ్వరూపం.. అదిరిపోయిన కోటబొమ్మాళీ టీజర్
” క్షణం సినిమా ఛాన్స్ రాకముందే నేను దేవి శ్రీ ప్రసాద్ 2013లో పనిచేశా. ఆ సమయంలోనే మొదటిసారి అడివి శేష్ ను కలిశాను. ఆ సమయంలో నేను అనుకునేదాన్ని.. ఈ హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించింది. అందుకే అప్పుడు అడివి శేష్‌ను బాగా అవాయిడ్ చేశా. ఇక మూడు నెలల తరువాత ఒక కాఫీ షాప్ లో కలిశాను. అప్పుడు శేష్.. నన్ను కూర్చోపెట్టి క్షణం స్క్రిప్ట్ వినిపించాడు. నాకు బాగానచ్చింది . నేను జబర్దస్త్ లో కోపం గా ఉండడం చూసి అడివి శేష్ ఈ పాత్రకు నేను అయితేనే సెట్ అవుతాను అనుకోని నా కోసం చూశారట” అని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా కుర్ర హీరో కూడా అందరి హీరోలలానే అనుకుంది రంగమత్త అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.