Anand Devarakonda Birthday Special Posters.
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా హైవే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత వెంకట్ తలారి. ఇవాళ ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ‘హైవే’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హిల్ స్టేషన్ లో ఈ యంగ్ హీరో టూర్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉందీ పోస్టర్. కొండ రాయిపై కూర్చుని చుట్టూ అందమైన నేచర్ ను చూస్తున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఆనంద్ కు బర్త్ డే విషెస్ చెప్పింది చిత్ర యూనిట్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బేబీ’ నుండి నయా పోస్టర్
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మరో సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.
