Manchu Manoj: శుభవార్త ఓకేగాని… పెళ్లా? సినిమానా? సోదరా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చి తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరో మంచు మనోజ్. మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ హీరో అవుతాడు అనే నమ్మకం కలిగించిన మనోజ్, తన కామెడీ టైమింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈజ్ చూపించి ప్రేక్షకులని మెప్పించాడు. ఒకానొక సమయంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మంచు మనోజ్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగా సరైన కథలని ఎంచుకోవడంలో ఫెయిల్ అయిన మంచు మనోజ్, కోరి కష్టాలని తెచ్చుకున్నాడు. ఒక్కడు మిగిలాడు సినిమా సమయంలో ఈ మూవీ ఫ్లాప్ అయితే నేను ఇక సినిమాలు చెయ్యడం ఆపేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి మంచు మనోజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఒక్కడు మిగిలాడు మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో చెప్పినట్లుగానే మంచు మనోజ్ సినిమాల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఊహించని పరిణామాలు జరగడంతో మనోజ్, పూర్తిగా సినిమాల విషయంలో సైలెంట్ అయిపోయాడు.
2020లో ‘అహం బ్రహ్మాస్మీ’ సినిమాతో మంచు మనోజ్ రీఎంట్రీ అనౌన్స్ చేశాడు కానీ ఆ ప్రాజెక్ట్ ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. ఇక అప్పటినుంచి మంచు మనోజ్ లైం లైట్ లో కనిపించడం మానేసాడు. దాదాపు రెండేళ్ల తర్వాత 2022 వినాయక చవితి సమయంలో మంచు మనోజ్, భూమ మౌనిక(భూమ నాగిరెడ్డి చిన్న కూతురు)తో బయటకి వచ్చి మళ్లీ వార్తల్లో నిలిచాడు. మౌనికతో కలిసి మంచు మనోజ్ పూజలు కూడా నిర్వహించడంతో మంచు మనోజ్, మౌనికలు పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేస్తున్న మంచు మనోజ్, “It’s been a while, i’ve been holding this special news close to my heart Excited to enter into the next phase of my life. Announcing on 20th Jan 2023. Need all your blessing as always” అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ మంచి వార్త సినిమా గురించా లేక పెళ్లి గురించా అనేది మనోజ్ క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఫేజ్ ఇన్ లైఫ్ అంటున్నాడు కాబట్టే అది పెళ్లి గురించే అని అందరూ అనుకుంటున్నారు కానీ మంచు మనోజ్ క్లోజ్ సర్కిల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది సినిమా గురించే. మరి జనవరి 20న మంచు మనోజ్ ఎలాంటి న్యూస్ ఇస్తాడో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️
Excited to enter into the next phase of my life.. 🙂
Announcing on 20th Jan 2023 🤗
Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2023
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!