Amrita Rao: సినిమా.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరిని నమ్మాలి.. ఎవరిని నమ్మకూడదు అనేది చెప్పడం చాలా కష్టం. సొంతవారిని కూడా నమ్మలేని పరిస్థితి. ముఖ్యంగా హీరోయిన్లు.. ఇండస్ట్రీలో తమ మేనేజర్లను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అయితే అలా తన మేనేజర్ ను నమ్మే.. తాను ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు చెప్పుకొచ్చింది. వివాహ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ అమృత. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిథి సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది కానీ, అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తరువాత ఈ చిన్నది టాలీవుడ్ వైపే తొంగి చూడలేదు.
Vivek Agnihotri: ఇందిరా గాంధీ కనుక కశ్మీర్ ను కాపాడి ఉంటే.. నేను ఆ పని చేసేవాడిని కాదు
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమృత తనకు దక్కాల్సిన ఒక ఛాన్స్ ను తన మేనేజర్ వలన పోగొట్టుకున్నాను అని, అతడు చేసిన మోసం తలుచుకుంటే ఇప్పటికి గుండె బద్దలవుతుందని చెప్పుకొచ్చింది. ” నేను ఆసమయంలో అతిథి మూవీ చేస్తున్నాను. మహేష్ బాబుగారితో షూటింగ్ అయిపోయాక తాజ్ బంజారా హోటల్ కు వెళ్ళిపోయాను. అక్కడ నాకు నిర్మాత బోనీ కపూర్ తో పనిచేసిన ఒక వ్యక్తిని చూశాను. అతడు నన్ను చూసి వచ్చి పలకరించాడు. నేను పలకరించాను. తరువాత తను.. నీ డేట్స్ కనుక అడ్జెస్ట్ అయ్యి ఉంటే.. ఇప్పుడు మనం సల్మాన్ ఖాన్ వాంటెడ్ సినిమాలో పనిచేస్తూ ఉండేవాళ్ళం అని అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏంటి.. వాంటెడ్ సినిమాకు నన్నెప్పుడు అడిగారు. నాకు ఈ విషయం తెలియనే తెలియదు అన్నాను. వెంటనే అతను.. అదేంటి.. మీ మేనేజర్ కు కాల్ చేసి అడిగితె.. నీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వవు అని చెప్పాడు.అందుకే మేము వేరే హీరోయిన్ ను తీసుకున్నాం అని చెప్పాడు. ఆ సమయంలో నా గుండె బద్దలయ్యింది. ఆ మేనేజర్ మీద నాకు పీకల్లోతు కోపం వచ్చింది. వాడు నాకు ఆ ఆఫర్ వచ్చింది అని చెప్పకుండా మోసం చేశాడు. పొమ్మన్నలేక పొగ పెట్టినట్లు.. నా దగ్గర నుంచి వెళ్లిపోవడానికి.. ఈ ప్లాన్ వేసి.. నేనే వెళ్ళిపో అనేలా చేసుకున్నాడు” అని గుర్తుచేసుకుంది. ఒకవేళ వాంటెడ్ సినిమా కనుక అమృత చేసి ఉంటే .. అమ్మడు రేంజ్ ఇప్పుడు వేరేలా ఉండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.