Malli Pelli : ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపి వేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన పరువుకు భంగం కలిగించేలా మళ్ళీ పెళ్లి సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేష్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఈ కేసును దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ప్రైమ్ తొలగించనట్లు తెలుస్తుంది.
తెలుగుతో పాటు కన్నడ స్ట్రీమింగ్‌ను కూడా ఆపేసినట్లు సమాచారం.నరేష్ మరియు పవిత్రా లోకేష్ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలతో దర్శకుడు ఎం.ఎస్. రాజు మళ్ళీ పెళ్లి సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమా టీజర్స్ మరియు ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా థియేటర్ల లో మాత్రం ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. నరేష్, పవిత్రా లోకేష్ ఎలా రిలేషన్ లోకి వచ్చారో వంటి అంశాలను తెరకెక్కించాడు దర్శకుడు ఎం. ఎస్ రాజు.విజయకృష్ణా మూవీ బ్యానర్‌పై నరేష్ తానే స్వయంగా మళ్ళీ పెళ్లి సినిమా ని నిర్మించారు. ఈ సినిమాలో వనితా విజయ్‌కుమార్, శరత్‌బాబు మరియు జయసుధ ముఖ్య పాత్రలు పోషించారు.అందరికి తెలిసిన కథే కావడంతో థియేటర్లలో ప్రేక్షకులు ఈ మూవీకి అంతగా ఆదరణ లభించలేదు.. కానీ ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. మంచి వ్యూస్ ని కూడా రాబట్టింది. కానీ కోర్ట్ కేస్ లతో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ మూవీ స్ట్రీమింగ్ ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.
Also Read
తాజావార్తలు
-
Senior Hero : సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న హీరో
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
-
Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
-
HMD Arc 2: 5000mAh బ్యాటరీ, AI కెమెరాతో చవకైన స్మార్ట్‌ఫోన్.. HMD ఆర్క్ 2 విడుదల
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!