సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ సినిమా కుబేర. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు.
Also Read : AG 3 : గల్లా అశోక్ ‘VISA – వింటారా సరదాగా’ ఫస్ట్ లుక్ రిలీజ్
యేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రిలీజ్ కు ముందు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పుడు కుబేర తమ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. ఈ నెల 18న కుబేర ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలోను స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. జూన్ 20న థియేటర్స్ లో రిలీజ్ అయిన కుబేర కేవలం 28 రోజుల రన్ తర్వాత ఓటీటీ స్ట్రమింగ్ కు వస్తోంది. మరి ఓటీటీ లో ఏ మేరకు వ్యూస్ రాబడుతుందో చూడాలి.