Ram Charan: మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. బన్నీ.. మెగాస్టార్ ఇంటికి వెళ్లడం మానేశాడు. ఆ కుటుంబం ఫంక్షన్స్ లో బన్నీ కనిపించడం లేదు. చరణ్ కు గ్లోబల్ ఇమేజ్ వచ్చిందని అల్లు అర్జున్ కు అసూయ ఎక్కువ అయ్యింది.. ఇలా ఏవేవో పుకార్లు షికార్లు చేస్తూ వచ్చాయి. మా రెండు కుటుంబాల మధ్య ఎటువంటి విబేధాలు లేవు అని ఒకపక్క చిరంజీవి, ఇంకోపక్క అల్లు అరవింద్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా చెప్తూనే ఉన్నారు. షూటింగ్స్ వలన.. మెగా కజిన్స్ కలుసుకోలేకపోతున్నారు కానీ, ఫంక్షన్స్ కు ఖచ్చితంగా కలుస్తారు అని అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చాడు. ఇక అదే నిజమని అల్లు అర్జున్ రుజువు చేశాడు. మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో సందడంతా ఈ బావబావాబామ్మర్దులదే. అలా పిలుచుకోకపోయినా.. బన్నీ, చరణ్ ఎప్పుడు మంచి బ్రదర్స్ గానే పెరిగారు.
Sreeleela: గ్యాప్ ఇవ్వమ్మా.. శ్రీలీల.. కొంచెం గ్యాప్ ఇవ్వు
ఇక నేడు రామ్ చరణ్- ఉపాసన 11 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి.. ఒక అరుదైన ఫోటోను షేర్ చేసి.. ఈ విబేధాలకు చెక్ పెట్టింది. వరుణ్ ఎంగేజ్ మెంట్ లో అల్లు అర్జున్ దంపతులతో కలిసి చరణ్ దంపతులు కలిసి దిగిన ఫోటో అది. ఫార్మల్ డ్రెస్ లో చరణ్.. ట్రెడిషనల్ డ్రెస్ లో బన్నీ.. చీరలో స్నేహ..గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉపాసన .. ఎంతో అందంగా ఉన్నారు. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన స్నేహ.. వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.. చరణ్ మరియు ఉపాసన అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసాక అయినా వీరిద్దరి మధ్య విబేధాలు లేవు అని అభిమానులు నమ్మితే ఫ్యాన్స్ వార్ జరగవు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చరణ్- బన్నీ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారారు. పుష్ప 2 తో బన్నీ వస్తుండగా.. గేమ్ ఛేంజర్ తో చరణ్ వస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో మరోసరి హిట్ ఎవరు కొడతారో చూడాలి.