Allu Aravind: ఆ రెండు కారణాలతోనే అల్లు సినిమాస్ నిర్మించా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోకాపేట ఏరియాలో నూతనంగా నిర్మితమైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్, తెలంగాణ CM రేవంత్ రెడ్డి చేతులు మీదగా ఘనంగా ప్రారంభమయ్యింది. అయితే మీడియా కోసం ఎక్స్క్లుజివ్ గా స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేసిన క్రమంలో ఈ మల్టీప్లెక్స్ థియేటర్ లో వాడిన అధునాతన డాల్బీ సిస్టమ్ అండ్ సౌండ్ గురించి కొద్ది సేపు స్క్రీనింగ్ ప్రదర్శించిన అనంతరం పుష్ప 2, ఆర్ఆర్ఆర్ సీన్స్ తో పాటు వారణాసి, హిందీ రామాయణ్ 3D ట్రైలర్స్ ను కూడా ప్రదర్శించారు.
Also Read:Anushka : పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?
Also Read
- Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. 'భాగమతి' డైరెక్టర్‌పై కేసు నమోదు!
- Lenin : అఖిల్‌కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
- Prabhas : 'ఫౌజీ' బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!
అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ “మా థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంటుందో చూపిద్దామని, అలాగే నేను రెండు ఏళ్ళుగా దేని కోసం కష్టపడుతూ వస్తున్నానో మీకు తెలియాలని మీ అందర్ని పిలవడం జరిగిందని చెప్పారు. అలాగే తాను ఇంతా పెద్ద థియేటర్ కట్టడానికి రెండే రెండు కారణాలు ఉన్నాయని ఒకటి UV క్రియేషన్స్ వంశీ సూళ్లూరుపేటలో కట్టిన అతి పెద్ద థియేటర్ చూసి కోరిక కలగడం అయితే రెండో కారణం నాకు బాగా పరిచయం ఉన్న ఓ బడా వ్యాపారవేత్త మిషన్ ఇంపాజిబుల్ 6 సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రసాద్ pcx స్క్రీన్ లో టికెట్స్ కావాలని ప్రాధేయపడడం అన్నారు. ఆ రెండు ఇన్సిడెంట్స్ తోనే ఈ బిగ్ స్క్రీన్స్ పై ఇంట్రెస్ట్ ఏర్పడిందని ఆ ఇంట్రెస్టనే ఈ అల్లు సినిమాస్ గా మారిందని చెప్పారు. ఇక ఈ బిగ్ స్క్రీన్ డాల్బీ విజన్ థియేటర్ లో 72 స్పీకర్స్ , 165 సౌండ్ ఔట్లెట్స్ తో పాటు 600 కి పైగా సీటింగ్ కెపాసిటీ ఉంది అని తెలిపారు. కేవలం ఈ సౌండ్ సిస్టమ్ ఇన్స్టాల్ చెయ్యడానికే దాదాపు 9 నెలలు సమయం పట్టిందని ఆయన తెలియజేశారు. సిటీ జనంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఈ డాల్బీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి మంచి అనుభూతి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం నాలుగు స్క్రీన్లు ఉన్న ఈ డాల్బీ సిస్టమ్ మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక టికెట్ మ్యాగ్జిమం ప్రైస్ 450 గా నిర్ణయించారు. అలాగే రేపటి నుంచే ప్రేక్షకులు ఈ థియేటర్ లో సినిమాలు చూసేందుకు బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!